స్వచ్ఛమైన తాగునీటితోనే సంపూర్ణ ఆరోగ్యం!

28-11-2026 | 10:40pm

సంగినేనిపల్లిలో సామాజిక నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం

వీపనగండ్ల, నవంబర్ 28 : ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సంగినేనిపల్లి గ్రామంలో(Sanginenipalli Village) సామాజిక నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ పల్లా జయంతి వేణుమాధవ్ రెడ్డి(Village Sarpanch Palla Jayanthi Venumadhav Reddy) తెలిపారు. శనివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కలుషిత నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health issues) తలెత్తే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ శుద్ధి చేసిన నీటిని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

గ్రామ ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. గ్రామానికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పించేందుకు సహకరించిన ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష, ఫౌండేషన్ ఆపరేటింగ్ మేనేజర్ రమేష్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు, ముజీబ్, శ్రీనివాసులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, నాయకులు సుదర్శన్ రెడ్డి, ధనుంజయుడు, విజయ్ భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు