ఖేల్ ఇండియా పోటీలకు ఎంపికైన గిరిజన విద్యార్థులు
* జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న 14 మంది క్రీడాకారులు..
ఉట్నూర్, నవంబర్ 28 ( విజయక్రాంతి ): రాష్ట్రంలోని హైదరాబాద్, హనుమకొండలో(Hyderabad, Hanamkonda) డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించే 8వ ఎడిషన్ ఖేల్ ఇండియా జాతీయ స్థాయి పోటీలకు అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గిరిజన ఆదర్శ పాఠశాలకు చెందిన 14 మంది వివిధ క్రీడలలో పాల్గొనేందుకు 14 మంది ఎంపికైనట్లు గిరిజన సంక్షేమ శాఖ జిల్లా క్రీడల అధికారి పార్థసారథి తెలిపారు.
డిసెంబర్ 11 నుండి 22 వరకు నిర్వహించే జాతీయస్థాయి క్రీడా పోటీల్లో అథ్లెటిక్స్ లో పోటీలలో జిల్లా తరఫునుండి హెచ్ కె నగేష్ ఎంపిక కాగా, ఖో ఖో పోటీలో పాల్గొనేందుకు మెస్రం నిఖిల్, నవీన్ కుమార్, శంకర్, ఆత్రం యాదవ్ రావు, ఆర్. శివ సాయి, ఆకీ పోటీల్లో పాల్గొనేందుకు ఆత్రం జగ్జీవన్, రాథోడ్ ధనరాజ్, జాదవ్ సాయి ప్రసాద్, చవాన్ సాయిరాం, ఆత్రం శంబు, జాదవ్ నితీష్ ఎంపికయ్యారని ఆయన తెలిపారు. జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులు డిసెంబర్ 11వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగే పోటీలలో పాల్గొని అదిలాబాద్ జిల్లా సత్తా చాటించి జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.