ఘనంగా అయ్యప్ప పడి పూజ

28-11-2026 | 10:34pm

ఎల్బీనగర్, నవంబర్ 28 : గడ్డిఅన్నారం(Gaddiannaram) నేతాజీనగర్ కాలనీలో శనివారం అయ్యప్పస్వామి మహా పడిపూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు  మొగిలి నర్సింహ గురుస్వామి 18వ పడి సందర్భంగా నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజా స్వాముల శరణుఘోషలతో, భజన కీర్తనలతో ఆద్యంతం భక్తిశ్రద్ధలతో(devotional) సాగింది.

ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,  తెలంగాణ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, యాదగిరి గుట్ట  బోర్డు సభ్యులు గుండా మల్లయ్య, మాజీ కార్పొరేటర్లు బద్దుల వెంకటేష్‌యాదవ్, రంగా నర్సింహ గుప్తా, బద్దం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి, గండి సన్నీ యాదవ్, కాసం రాంరెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీంపాషా, ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్,  గురుస్వాములు సిద్ధు ముదిరాజ్, బద్దుల మల్లేష్‌యాదవ్, అరవింద్, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు