దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
*కేసీఆర్ ఉన్నప్పుడే ప్రతీ దండారి ఉత్సవాలకు రూ. 10 వేలు వచ్చేవి...
*80 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో ఆదివాసులని గుర్తించింది ఏకైక నాయకుడు కేసీఆర్...
*ఆదివాసుల సంస్కృతి కాపాడడానికి రూ. 12 కోట్లతో జోడేఘాట్ లో మ్యూజియం ఏర్పాటు చేసింది కేసీఆర్....
సిరికొండ, నవంబర్ 04 (విజయక్రాంతి): సిరికొండ మండలంలోని రాయిగూడ గ్రామంలో బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) పర్యటించారు. గ్రామంలో ఆదివాసుల సాంప్రదాయంగా దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతీ దండారి ఉత్సవాలకు రూ. 10 వేల చొప్పున ఉమ్మడి జిల్లాలోని వెయ్యి దండారీలకు డబ్బులు అందించి ఆదివాసుల సంతోషాల్లో ఉత్సవాల్లో భాగమయ్యేవారని అన్నారు.
ఆదివాసులు వెనక ఉండకూడదు, వారి గ్రామంలో వారిదే రాజ్యం నడవాలి అన్న కళ మావనాటే మావరాజ్ ను సాకారం చేసి గ్రామంలో వారిదే రాజ్యంగా వారినే సర్పంచ్ చేశారని అన్నారు. గ్రామస్తులు దండారి షెడ్డు నిర్మించివ్వాలని కోరారు.కచ్చితంగా దండారి షెడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్ శిష్యుడిగా మీ దండారికి రూ. 11 వేలు అందిస్తానాని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.