తెలంగాణ సంస్కృతిలో గిరిజన వెలుగులు

10-11-2026 | 04:36pm

ఎమ్మెల్యే  జాదవ్ అనిల్

బోథ్. నవంబర్ 10 (విజయక్రాంతి): గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు(Tribal culture and traditions) తెలంగాణ రాష్ట్రంలో వారసత్వ అంతర్భాగమని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) పేర్కొన్నారు. నేరడిగొండ మండలంలోని(Neradigonda Mandal) లకం పూర్ గ్రామంలో దండారి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఐటిడిఏ పిఓ మంద మకరందతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు కలలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కెసిఆర్(KCR) ప్రత్యేక ప్రోత్సాన్ని అందించారన్నారు.

ఆదివాసీల ఆచార వ్యవహారాలు దండారి వంటి సాంప్రదాయ కళారూపాలు భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసులు వారసత్వంగా వస్తున్న యాచారాన్ని సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గిరిజన సాంప్రదాయాల పరిరక్షణకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఏ టి డి ఓ ఆత్రం భాస్కర్ పలువురు నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు