పూలాజీ బాబా ధ్యాన మందిర్ 27వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యేకి ఆహ్వానం..

11-11-2026 | 07:42pm

*ధ్యాన మందిర్ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని... 

*ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

ఇంద్రవెల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలంలోని ఆంజీ గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గ్రామంలో గురువారం (12-11-2026) జరుగుతున్న శ్రీశ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిరం 27వ వార్షికోత్సవ నికి ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel)ని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.

ఈ మేరకు బుధవారం ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, ఆంజీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ముఖడే విష్ణు, మామిడిగూడ గ్రామ పటేల్ పాండరే శ్యామ్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలకు హాజరై పూలాజీ బాబా ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పూలాజీ బాబా ధ్యాస మందిరం వార్షికోత్సవ వేడుకలను మండల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గోవాడే మారుతి, గ్రామస్తులు మురమురె రావుజీ, ధనాజీ, సంజీవ్, గారుళే గోవిందరావు, గారుళే ప్రహ్లద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు