సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక భాయ్ దూజ్

11-11-2026 | 07:47pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే భాయ్ దూజ్(Bhai Dooj) వేడుకలను జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ ముగింపు వేడుకగా జరుపుకునే ఈ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు నుదుట తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, స్వీట్లు తినిపించారు. సోదరులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. సోదరులు సైతం తమ సోదరీమణులకు కానుకలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. భాయ్ దూజ్ పండుగ కేవలం సంప్రదాయ వేడుక మాత్రమే కాదని, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఆప్యాయత, అనురాగం, ఆత్మీయతను చాటిచెప్పే పండుగ అని పలువురు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు