మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు

11-11-2026 | 07:45pm

కొత్తపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): జిల్లా యువజన కాంగ్రెస్(District Youth Congress) ఉపాధ్యక్షుడు కిమ్ ఫహాద్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ లోని షే సాహెబ్ కాలనీలో గల ప్రభుత్వ బాలికల హైస్కూల్(Government Girls' High School) (ఉర్దూ మీడియం) లో నిర్వహించి నటువంటి భారత దేశ ప్రథమ విద్యాశాఖ మాత్యులు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డా.వి.నరేందర్ రెడ్డి  మరియు కరీంనగర్ సిటీ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరైనారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

1947 నుండి 1958 వరకు సుమారు 11 సంవత్సరాల పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆజాద్, భారతదేశ విద్యా రంగంలో అనేక చారిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

దేశంలో ఉన్నత విద్య, , సాంకేతిక విద్య అభివృద్ధికి విశేష కృషి చేసి, ఐఐటీ ఖరగ్‌పూర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్, ఏఐసిటిఈ,  సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సాంస్కృతిక సంస్థలైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్,  కేంద్ర సాహిత్య అకాడమీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల స్థాపనకు పునాదులు వేశారని పేర్కొన్నారు. 

 పలు ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించి విజేతలకు పాడ్స్ మరియు పెన్నులను  బహూకరించారు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రావణ్ నాయక్ , ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్ ఖాన్ , ఇన్చార్జి హెచ్ఎం ఆసియా గారు, ఇమ్రాన్ ఘని, అర్బన్ డిసిసి జనరల్ సెక్రెటరీ, సత్తినేని శ్రీనివాస్, అర్బన్ డిసిసి జనరల్ సెక్రెటరీ  కె అశోక్, అర్బన్ డిసిసి జనరల్ సెక్రెటరీ,లాల్ శ్రీకాంత్,31 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పొన్నాల రాజేష్ ,28 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీకాంత్,జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మరియు అనుబంధ సంస్థల నాయకులు మరియు కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు