దేశ రైతాంగానికి ఎంపీ జనార్దన్ మిశ్రా క్షమాపణ చెప్పాలి

11-11-2026 | 07:44pm

వరంగల్ (విజయక్రాంతి): అన్నదాతలపై మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా(MP Janardan Mishra) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రైతు సంఘాల నాయకులు బుధవారం వరంగల్ నగరంలోని కాశీబుగ్గ అంబేడ్కర్​ జంక్షన్​లో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు సోమిడి శ్రీనివాస్​ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి ఎంపీ జనార్దన్ మిశ్రా రైతులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల బిజెపి ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించాలని, ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు