ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మిల్లర్లకు ధాన్యం కేటాయింపు
అదనపు కలెక్టర్ అనిల్ కుమార్
మహబూబాబాద్ (విజయక్రాంతి): సీఎంఆర్ కోటా(CMR Quota) కింద 2026 - 27 సీజన్ కు సంబంధించి ప్రభుత్వం(Government) నిర్దేశించిన అర్హత కలిగిన, అగ్రిమెంట్, బ్యాంకు గ్యారంటీ (Bank Guarantee)ఇచ్చిన మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తామని, ప్రభుత్వం రూపొందించిన అగ్రిమెంట్ సమర్పించాలని రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, జిల్లాలోని రైస్ మిల్లర్లతో ఈ వానాకాలంలో పండిన ధాన్యం సేకరణ, కేటాయింపు పై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సీఎంఆర్ కోటా బియ్యం రోజువారి లక్ష్యాలను పాటిస్తూ బియ్యం ఇవ్వాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రమేష్, జిల్లా పౌరసరఫరా సంస్థ మేనేజర్ మనోజ్ కుమార్, ఉపతాహసిల్దార్లు పాల్గొన్నారు.