కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ

17-11-2026 | 06:42pm

ఆదిలాబాద్, నవంబర్ 17, (విజయక్రాంతి): యువ మోర్చా నాయకులు బీజేపీ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చురుకైన పాత్ర పోషించాలని ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh) ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, యువ మోర్చా జిల్లా అధ్యక్షుల సాయి కృష్ణ లతో కలిసి నూతనంగా నియమితులైన బీజేపీ యువ మోర్చా జిల్లా నూతన కార్యవర్గ సభ్యులకు ఎంపీ నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువ నాయకులు పాయల్ శరత్, క్రాంతి కుమార్, వెంకట్ స్వామి, వాగ్మరె శైలేంద్ర, అనూప్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు