మిషన్ భగీరథ ట్యాంకులు పరిశీలించిన అధికారులు

17-11-2026 | 06:36pm

సిరికొండ , నవంబర్ 17 (విజయ క్రాంతి): సిరికొండ మండల కేంద్రంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్(Mission Bhagiratha Water Tank) లను (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ) E E నరేష్ బాబు   A  E E అన్విత్ రెడ్డి  సర్పంచ్ మల్లెల సాయి చరణ్ తో కలిసి పరిశీలించారు. 90 వేల లీటర్ల ట్యాంకును, ఎస్సీ కాలనీలో ఉన్న 40 లీటర్ల ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానంలో నూతనంగా లక్ష లీటర్ల గల ట్యాంక్  నిర్మిస్తే ప్రజలందరికీ  త్రాగునీరు అందుతుందని సర్పంచ్  అధికారులకు విన్నవించారు.

సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ్యామా శోభన్,వార్డు మెంబర్లు కనగందుల మురళి, చిట్యాల రంజిత్, నరసయ్య, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ రమేష్,ఏరియా సైట్ ఇంజనీర్ చారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు