జిల్లా కేంద్రంలో ఘనంగా యువజన ఉత్సవాలు

17-11-2026 | 06:43pm

భూపాలపల్లి, నవంబర్ 17 (విజయ క్రాంతి): ఇల్లందు క్లబ్‌లో(Illandu Club) నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను(District-level youth festivals) ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అడిషనల్ కలెక్టర్ ఎల్. విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులకు మెమెంటోలు అందజేశారు.

జిల్లాస్థాయిలో విజేతలైన కళాకారులు త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సి.హెచ్. రఘు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, ఫైర్ ఆఫీసర్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. డి. లావణ్య కుమారి, ఎం. శివసాగర్, సి.హెచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు