అనంతసాగర్‌లో గడ్డి డీసీఎం దగ్ధం

17-11-2026 | 06:32pm
  1. త్రుటిలో తప్పిన ప్రమాదం
  2. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం

చేగుంట నవంబర్ 17,విజయక్రాంతి: చేగుంట మండలం అనంతసాగర్ గ్రామం(Ananthasagar Village) నుండి గడ్డి లోడుతో  హైదరాబాద్ కు వెళ్తున్న డీసీఎం వాహనం ప్రమాదవశాత్తు  కరెంట్ వైర్లు తగలి మంటలకు గురై దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డీసీఎం డ్రైవర్ యాదగిరి చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని గ్రామ సమీపంలో ఉన్న చెరువులోకి  వాహనాన్ని తీసుకెళ్లాడు   దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గడ్డి లోడుకు మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనం వెనుక భాగం దగ్ధమైంది , డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగలేదు.

మరిన్ని వార్తలు