డ్రగ్స్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమం
ఎర్రుపాలెం నవంబర్ 17 ( విజయక్రాంతి): మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) నందు డ్రగ్స్ రహిత సమాజం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నవ శకం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ విచ్చేసిన గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ , మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు .
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్, ఉప సర్పంచ్ షాభాషా , జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకట నర్సయ్య, సొసైటీ ఉపాధ్యక్షులు కడియం శ్రీనివాస్ రావు, వెంకటాపురం తెలుగుదేశం గ్రామ శాఖ అధ్యక్షులు బొగ్గుల సత్యనారాయణ రెడ్డి , మేకల రమేష్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు, ఆంగ్ల భాష ఉపాధ్యాయులు తుంగతుర్తి వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.