సమస్యాత్మక పాఠశాలలను సందర్శించిన అదనపు కలెక్టర్

17-11-2026 | 06:26pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): సమస్యాత్మక పాఠశాలలను(Problematic school) మంగళవారం మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాధికారి కే. అనిల్ కుమార్ సందర్శించారు. సోమవారం నిర్వహించిన బాలల ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కంబాలపల్లి ప్రాథమిక పాఠశాలను(Kambalapalli Primary School) అదనపు కలెక్టర్ సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఒక్కరోజు వ్యవధిలోనే సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం స్పందించడం పట్ల తల్లిదండ్రులు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను జిల్లా కలెక్టర్ కు నివేదించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు