పేదల ఆర్థిక అభివృద్ధికి ‘చేయూత'
- ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్
- లబ్ధిదారులకు పింఛన్ పత్రాల పంపిణీ
మహబూబాబాద్ (విజయక్రాంతి): పేదల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress People's Government) కట్టుబడి పని చేస్తుందని, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని, కొత్తగా చేయూత పథకంలో(Cheyutha Scheme) పింఛన్ మంజూరు చేసి ఆర్థికంగా నిలబడేందుకు కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే, డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో చేయూత పథకం ద్వారా కొత్తగా మంజూరైన పింఛన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూదన రాజు, డీవివో స్వరూప, ఎంపీడీవో సుజాత తదితరులు పాల్గొన్నారు.