ఎస్సీ వర్గీకరణలో నేతకాని సమాజానికి న్యాయం చేయాలి

11-11-2026 | 04:38pm
  1. హలో నేతకాని – చలో ఉస్మానియా” వాల్ పోస్టర్లు విడుదల..
  2. నవంబర్ 15న హైదరాబాద్ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలి..
  3. సాయిని ప్రసాద్ నేత..

ఉట్నూర్,నవంబర్ 11 ( విజయక్రాంతి ): ఎస్సీ వర్గీకరణలో(SC Categorization) నేతకాని సమాజానికి(Netakani Community) న్యాయం చేయాలని, విద్యా, ఉద్యోగ రంగాల్లో(Employment Sector) సముచిత అవకాశాలు కల్పించాలని నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, TNMVS OUJAC ప్రోగ్రాం కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత డిమాండ్ చేశారు.  

ఈ నెల 15న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “హలో నేతకాని – చలో ఉస్మానియా” రాష్ట్రస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఉట్నూర్ ప్రెస్ భవన్ ఎదుట నేతకాని నాయకులు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయిని ప్రసాద్ నేత మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణలో నేతకాని సమాజానికి తగిన గుర్తింపు,

న్యాయమైన వాటా కల్పించాలని కోరారు. సమాజంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కుల బాంధవులందరూ వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

నవంబర్ 15న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా నలుమూలలతో పాటు ఉట్నూర్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి నేతకాని కుల బాంధవులు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం వైస్ చైర్మన్ బోర్లకుంట ప్రభుదాస్, కో-కన్వీనర్ జాడి గంగాధర్, నేతకాని సంఘం మండల అధ్యక్షులు గొల్లపల్లి నరసయ్య, నేతకాని యువసేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జాడి వెంకటేష్ నేత,నేతకాని సీనియర్ నాయకులు దూట మహేందర్, జాడి రాజేశ్వర్, ముంజం గవాస్కర్, చందనగిరి విజయ్,

తుడుం ప్రశాంత్, బండారి పోషన్న, ధర్మిన గంగరాజు, జాడి ముల్లేష్, మేడి మల్లయ్య, గొల్లపల్లి సుదర్శన్, జాడి లక్ష్మణ్, ఆర్. విజయ్, బోర్లకుంట సోము, దర్శన గంగాధర్, బండారి రాజేందర్, బోర్లకుంట దుర్గయ్య, కామెరి శ్రీహరి, గుడిపల్లి నరసయ్య, సోగుల ప్రవీణ్, జాడి మల్లేష్, బండి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు