ప్రభుత్వ బడిలోనే విలువలతో కూడిన విద్య

11-11-2026 | 05:11pm
  1. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి 
  2. కోటి రూపాయలతో నిర్మించిన పాఠశాల ప్రారంభం. 

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన విద్య అందుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి(MP Mallu Ravi), ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy) అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో ఎంపీ మల్లు రవి నిధులు రూ.కోటితో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, పట్టణ అధ్యక్షుడు జక్కా రాజు, మాజీ వార్డు కౌన్సిలర్ అమృతమ్మ, అచ్చుతారెడ్డి, కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పద్మ, నిజాం, పడిగే శంకర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు