ఎన్సీఎస్టీ నేషనల్ కమిషన్ మెంబర్ ను కలిసిన రూప్ సింగ్..
తాడ్వాయి, నవంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం నందివాడ పల్లెగడ్డ తండాకు చెందిన లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్ ఎన్ సి ఎస్ టి నేషనల్ కమిషన్ మెంబర్ అయిన హుస్సేన్ నాయక్ ను కలిశారు. ఈ సందర్భంగా రూప్ సింగ్ నాయక్ మాట్లాడుతూ... గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
గిరిజనులకు ఏ సమస్య ఉన్న వెంటనే ఆ సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఇప్పటికీ చాలామంది గిరిజనులు భూస్వాములు, పెత్తందారులు అధికారుల చేతుల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారని అలాంటి వారికి ఖచ్చితమైన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపినట్లు వివరించారు.ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని హుస్సేన్ నాయక్ తెలిపిపారన్నారు.ఈ కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.