ఉప్పు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

11-11-2026 | 05:05pm

కొత్తపల్లి, నవంబర్ 11(విజయక్రాంతి): రామడుగు మండలంలోని వెలిచాల (కిష్ణారావుపల్లె) గ్రామం మున్నూరు కాపు సంఘం(Munnooru Kapu Sangham) గ్రామ అధ్యక్షుడిగా ఉప్పు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, మున్నూరు కాపు సంఘాన్ని బలోపేతం చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు