మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి
నిర్మల్ నవంబర్ 11 ( విజయ క్రాంతి): స్వాతంత్ర్య సమరయోధులు(Freedom Fighters), స్వతంత్ర భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్(Maulana Abul Kalam Azad) జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) వేడుకలను మంగళవారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ గారు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆధునిక భారతదేశ విద్యా వ్యవస్థకు, శాస్త్ర సాంకేతిక రంగాల రంగానికి మౌలానా ఆజాద్ వేసిన పునాదులు ఎనలేనివని ఆయన కొనియాడారు. ఐఐటీలు, యుజిసి వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమైనదని, విద్యార్థులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన (Essay Writing) పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రిన్సిపల్ చేతుల మీదుగా బహుమతులు మరియు ప్రశంసాపత్రాలు అందజేశారు. వ్యాస రచన లో ప్రథమ బహుమతి జియాన్ అహమ్మద్ , Quiz లో ప్రథమ బహుమతి టీమ్ Zigar, ద్వితీయ బహుమతి టీమ్ Faiz, తృతీయ బహుమతి టీమ్ Nazer పొందారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ హేమలత, డాక్టర్ పి.జి. రెడ్డి, డాక్టర్ రజిత, హబీబుర్ రహమాన్ (Habibul Rahaman), ఆఫ్రీన్ (Afreen), అస్లమ్ ఖాన్ (Aslam Khan), సాదియా (Saadia), మెహ్రోజ్ (Mehroz), తహ్నియత్ (Tahniyath), సనా (Sana), నుస్రత్ (Nusarath)లతో పాటు ఇతర అధ్యాపక బృందం, సిబ్బంది మరియు విద్యార్థిినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.