యువత ప్రతిభకు యువజనోత్సవాలు వేదిక
కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఈ నెల 17న ఇల్లందు క్లబ్‌హౌస్‌లో నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026 వాల్ పోస్టర్‌ను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతీ యువకులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు యువజనోత్సవాలు చక్కటి అవకాశమన్నారు. జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు గౌడ్ సీనియర్ అసిస్టెంట్ డి. లావణ్య కుమారి, శివసాగర్ తదితరులు పాల్గొన్నారు.