పేద ప్రజలకు విద్య, వైద్యం ఉచితం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.
తుంగతుర్తి, (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్యా, వైద్యం ఉచితంగా అందించడమే ప్రజాపాలన లక్ష్యమని, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(Tungaturthi MLA Mandula Samelu) అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం 100 పడకల హాస్పిటల్ ను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించి మాట్లాడారు .
దవాఖాన సూపర్డెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ అధ్యక్షతన, హాస్పిటల్ సిబ్బంది తో, సమీక్షా నిర్వహించారు. 24గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉండాలి.రోగుల కు నాణ్యమైన వైద్యం అందిచాలని డాక్టర్స్ కు కోరారు. ప్రస్తుతం ధవాకాల్లో పనిచేస్తున్న డాక్టర్లను సిబ్బందిని ప్రతి ఒక్కరితో మమేకమై మాట్లాడి, సుమారు 8 సంవత్సరాల మీ డాక్టర్ చదువును, పేద ప్రజలకు సేవ చేసి, న్యాయం చేయాలని కోరారు.
నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కావున రానున్న రోజుల్లో మద్దిరాల నూతనకల్ మధ్యలో నూతన జూనియర్ కళాజా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో 100 పడకల దవాఖానను అప్పగించాలని కోరారు. డాక్టర్లు ప్రజలకు ఆపరేషన్ కోసం సుమారు 1 కోటి 20 లక్షలతో, ప్రత్యేక వైద్య పరికారాలు రానున్న రోజుల్లో రానున్నట్లు తెలిపారు.
దవాఖానలో భాగంగా ప్రత్యేకంగా ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటుకు, ముఖ్యమంత్రితో మాట్లాడి ఏర్పాటు కృషి చేస్తానని అన్నారు. దవాఖానాల్లో పనిచేస్తున్న సిబ్బంది డాక్టర్లు సమయపాలన పాటిస్తూ, అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 2000 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వెలుగుపల్లి రుద్రమ్మ చెరువు దగ్గర రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్న గోదాముల నిర్మాణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ విద్యాసాగర్ రావు, స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, పిఎసిహెచ్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు రేగటి రవి గౌడ్, డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.