వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఏర్పాట్ల పరిశీలన
బోథ్: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవనాన్ని(Hospital building) డిసెంబర్ 1న జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ తోపాటు జిల్లా వైద్యాధికారి సాధన ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ప్రారంభోత్సవానికి చేపట్టాల్సిన చర్యల పైన సూపరిండెంట్ రవీంద్ర ప్రసాద్ తో చర్చించారు.
త్వరలో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మీతిలేష్ కు పి జి రేడియాలజీ విభాగంలో సీటు వచ్చినందుకు సన్మానించారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, టీపీసీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, మండల కన్వీనర్ మెరుగు భోజన్న, వి సురేందర్, చందు, ఎండి సద్దాం, మురళి గౌడ్, మౌలానా తదితరులు ఉన్నారు.