మహిళల రక్షణ కోసం షీ టీమ్

28-11-2026 | 06:42pm

మహబూబాబాద్: మహిళలు, బాలికల రక్షణ(Protection of Girls), భద్రతకు పోలీస్ శాఖ(Police Department) నిరంతరం అండగా ఉంటుందని, ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను, షీ టీమ్(She Team) ను సంప్రదించాలని మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, షీటీం ఎస్‌ఐ సునంద సూచించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ పీ.శబరిష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, షీ టీం సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబు, ఉపాధ్యాయ బృందం, సుమారు 700 మంది విద్యార్థినీ,  విద్యార్థులు పాల్గొన్నారు. షీ టీం సిబ్బంది పార్వతి, ప్రవళిక, ఏహెచ్‌టీయూ ఏఎస్ఐ రాజు, అరుణ, భరోసా కేంద్రం సిబ్బంది మౌనిక, రేణుక తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు