అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
28-11-2026 | 06:47pm
యజమానిపై కేసు నమోదు
మల్లాపూర్ నవంబర్ 28(విజయక్రాంతి): మండలంలోని పాతుధామరాజుపల్లి గ్రామ(Pathudhamarajupalli village) శివారులో గల గోదావరి నది(Godavari River) నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను మల్లాపూర్ పోలీసులు పట్టుకున్నారు.TS21 T 6392 నంబర్ గల ట్రాక్టర్లో గోదావరి నది నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై మల్లాపూర్ వీఆర్ఏ బురాం వంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రాక్టర్ను సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మల్లాపూర్ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.