గచ్చిబౌలి డిలైట్ బిల్డింగ్ వద్ద దట్టమైన పొగలు
అగ్నిప్రమాదంపై అనుమానాలు
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గచ్చిబౌలిలోని డిలైట్ బిల్డింగ్(Gachibowli Delight Building) వద్ద శనివారం దట్టమైన పొగలు కమ్ముకోవడం కలకలం రేపింది. భవనం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో అగ్నిప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పొగలను గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.
భవనంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా లేదా ఇతర కారణాలతో పొగలు వెలువడ్డాయా అన్నది తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి అగ్నిమాపక శాఖ, పోలీసుల అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.