విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి

28-11-2026 | 06:40pm

అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.తరణి

సిద్దిపేట క్రైం, నవంబర్ 28 : విద్యార్థులు(Students) చిన్నతనం నుంచే రాజ్యాంగ విలువలు(Constitutional Values), ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సిద్దిపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.తరణి(V. Tharani, Additional Junior Civil Judge, Siddipet) సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని(Indian Constitution Day) పురస్కరించుకొని సిద్దిపేటలోని మెరిడియన్ స్కూల్లో(Meridian School) విద్యార్ధులతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని(Mock Parliament Program) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి తరణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు ప్రతిపౌరుడికి ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, చర్చా నైపుణ్యాలు, ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన పెరుగుతాయని పేర్కొన్నారు.  విద్యార్థులు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా మెలగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు వి.దేవేందర్ రెడ్డి, ఎ.రాజావెంకట్ రెడ్డి, ప్రిన్సిపాల్ అనుశ్రీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు