చేతిరాతే విద్యార్థి విజయానికి తొలి మెట్టు

03-11-2026 | 11:07pm

శిక్షకులు ఎజాజ్ అహ్మద్..

​నార్సింగి, చేగుంట నవంబర్ 03 (విజయక్రాంతి): అందమైన చేతిరాత ప్రతి ఒక్కరికీ సాధ్యమేనని, సరైన సాధన, క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే ఎవరైనా తమ చేతిరాతను మెరుగుపరుచుకోవచ్చని ప్రముఖ చేతిరాత శిక్షకులు ఎజాజ్ అహ్మద్(Ejaz Ahmed) పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల చేతిరాతను తీర్చిదిద్దే లక్ష్యంతో మంగళవారం ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాల పరిమాణం, సరైన ఆకృతి, పదాల మధ్య ఉండాల్సిన అంతరం, రాసే సరైన విధానాలపై ఆయన ప్రత్యక్ష శిక్షణనిచ్చి మెలకువలు నేర్పించారు. ప్రధానోపాధ్యాయులు రవిచందర్ మాట్లాడుతూ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు, స్పష్టమైన, ఆకర్షణీయమైన చేతిరాత ఎంతో కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్ణచందర్ రావు, వెంకటేశ్వర శర్మ, దీప, రామకృష్ణ, పల్లవి, స్వప్న, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు