రోడ్డు ప్రమాదాలకు నెలవు

11-11-2026 | 02:25pm
  1. వారంలో రెండు ప్రమాదాలు
  2. మృతులు ఎందరో!

బోథ్. నవంబర్ 11 (విజయక్రాంతి) 44వ జాతీయ రహదారి(National Highway 44) నుండి బోత్.మండల కేంద్రం వరకు ఉన్న రోడ్డు ప్రమాదాలకు నేలవుగావగా మారింది. వారానికి రెండు ప్రమాదాలు తప్పనిసరిగా జరుగుతున్నాయి. నేరడిగొండ బోత్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కి వచ్చే ఈ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. రాత్రిపూట ఈ రోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు జంతువుతున్నారు. 

రోడ్డుపై గుంతలే కారణం....

రోడ్డుపైన అక్కడక్కడ గుంతల తో పాటు రోడ్డు మధ్యలో పగిలిపోయి ఉండడంతో ద్విచక్ర వాహనాల వారితో పాటు ఆటోలను ప్రయాణిస్తున్న వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాల చక్రాలు మధ్యలో పగిలిపోయిన రోడ్లపై విరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆటో ల ముందున్న చక్రాలు పగిలిపోయిన రోడ్డుపై ఇరికి అదుపుతప్పుతున్నాయి. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. 

గుంతలను తప్పించే క్రమంలో....

రోడ్లపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆటోల డ్రైవర్లు అంటున్నారు. మండల కేంద్రం సమీపంలో ఉన్న కోరమండల్ వద్ద రెండు చోట్ల ఇలాంటి గుంతలు ఉన్నాయని అంతేగాక పొచ్చెర క్రాస్ రోడ్ వద్ద పెద్ద గుంత ఉండడం ఎదురుగా వస్తున్న వాహనాలు రోడ్డు గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న వాహనాల వారిని ఢీకొడుతున్నారు.

తేజపూర్ గ్రామం సమీపంలో ఇటువంటి ప్రమాదకరమైన గుంతలు ఉన్నాయని అంటున్నారు. పోచ్చర జలపాతం రోడ్డు నుండి ఎక్స్ రోడ్ వరకు ఆరు చోట్ల ప్రమాదం జరిగే విధంగా రోడ్డు ఉందని అంటున్నారు. గుంతల మాయమైన రోడ్లను ఆర్ అండ్ బి అధికారులు పూడ్చివేసి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. 

అంతర్ రాష్ట్ర రహదారిపై సహితం... పోచ్చర క్రాస్ రోడ్ నుండి మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఘన్పూర్ వరకు రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పథకాలికంగా మరమ్మతులు చేపట్టిన తిరిగి రోడ్డు గుంతల మాయమవుతున్నది. భారీ వాహనాలు రోడ్డుపై నుండి వెళ్లడంతో పూడ్చిన గుంతలు మళ్లీ పెద్ద గుంతలుగా మారుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గుంతల మాయమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు