49.84 లక్షల విలువైన 99.688 కిలోల ఎండు గంజాయి దగ్ధం
మహబూబాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఈగల్ ఆదేశాల(Eagle's orders) మేరకు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల(Police stations) పరిధిలో ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన 19 కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న 99 కిలోల 688 గ్రాముల ఎండు గంజాయిని(Dried cannabis) చట్టపరమైన నిబంధనల ప్రకారం పూర్తిగా దగ్ధం చేశారు. దీని విలువ సుమారు 49,84,400 ఉంటుందని ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు.
జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, కోర్టు అనుమతి పొందిన అనంతరం స్వాధీనం చేసుకున్న గంజాయిని ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం, గోపాలపేట గ్రామంలోని (AWM Consulting, Common Bio Medical Waste Treatment Facility) వద్ద నిర్దేశిత ప్రత్యేక యంత్రాల ద్వారా నిబంధనల ప్రకారం పూర్తిగా దగ్ధం చేసి ధ్వంసం చేశారు.
ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో మహబూబాబాద్ డీ సీ ఆర్ బీ డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ ఉపేందర్, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు, అక్రమ రవాణా, నిల్వ లేదా విక్రయాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ప్రజల వద్ద ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.