బావిలోకి దూసుకుపోయిన కారు
జనగామ, నవంబర్ 11 (విజయక్రాంతి): బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామ(Pochannapeta village) శివారులోని వ్యవసాయ బావిలోకి9Agricultural well) ప్రమాదవశాత్తు కారు దూసుకుపోయింది. జనగామ మండలం పెద్ద రామన్చర్లకు చెందిన కొలిపాక ప్రశాంత్ కారు నడుపుతుండగా ప్రమాదం జరిగింది. కారు బావిలో పడుతుండగా ప్రశాంత్ తన భార్యను కారులో నుంచి బయటకు నెట్టి ప్రమాదం నుంచి తప్పించాడు.
అయితే ఆయన బావిలో పడ్డాడు. ఈత రావడంతో ప్రశాంత్ బావిలో నుంచి పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. వెంటనే స్పందించిన ఉప సర్పంచ్ ఉమేష్ చంద్ర, గ్రామస్తులు మరో ఇద్దరు తాడు సహాయంతో ప్రశాంత్‌ను బావి నుంచి బయటకు తీసి రక్షించారు. ఈ ఘటనలో భార్యాభర్తలకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో స్పందించి రక్షించిన ఉప సర్పంచ్, గ్రామస్తులను పలువురు అభినందించారు.