చర్లలో ఘనంగా యూనియన్ బ్యాంక్ 107వ వార్షికోత్సవం
బ్యాంక్ మేనేజర్ కృష్ణను ఘనంగా సన్మానించిన రైతు క్లబ్ చైర్మన్ రామాంజనేయులు
చర్ల :విజయ క్రాంతి :చర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్(Union Bank) (ఒకప్పటి ఆంధ్రా బ్యాంక్) బ్యాంకింగ్ రంగంలో 107 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బ్యాంక్ ఆవరణలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలిసి రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు బ్యాంక్ మేనేజర్ కృష్ణను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. రైతులకు బ్యాంక్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. రైతులకు రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు సకాలంలో అందిస్తూ బ్యాంక్ అభివృద్ధిలో మేనేజర్ కృష్ణ కృషి అభినందనీయమన్నారు.
బ్యాంక్ 107 ఏళ్లుగా ప్రజలకు నమ్మకమైన సేవలు అందిస్తూ ముందుకు సాగుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందిస్తామని మేనేజర్ కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ మేనేజర్ హరికృష్ణ, క్యాషియర్ శ్రీకాంత్, ఆర్డీవో షోయబ్, బ్యాంక్ సిబ్బంది శేషు, రాము, ఖాతాదారులు, రైతులు పాల్గొన్నారు.