పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
కాంట్రాక్టర్లు, దళారులపై చర్యలు తీసుకోవాలి: సీడం అన్నిగా
వాంకిడి, నవంబర్ 11 (విజయక్రాంతి): పీఎం జన్మన్ పథకం(PM JANMAN Scheme) కింద కొలాం పీవీటీజీ కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కొలం సేవ సంఘం(Service Organization) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీడం అన్నిగా డిమాండ్ చేశారు. మంగళవారం వాంకిడిలో ఆయన మాట్లాడుతూ.. చౌపన్‌గూడ, చిచ్చుపల్లి, పాఠాగూడ, దొడ్డిగూడ, సోనాపూర్, ఖిరిడి గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపించారు.
కొలాం గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు, దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి కుటుంబానికి నాణ్యమైన, పటిష్టమైన ఇల్లు నిర్మించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.