ఐక్య క్రిస్మస్ పోస్టర్ ఆవిష్కరణ
- డిసెంబర్ 9న ఐక్య క్రిస్మస్ సంబరాలు
- క్రిస్మస్ సందేశం, సంగీత గానాలు, క్యాండిల్ లైట్ సర్వీస్‌తో ఆధ్యాత్మిక కార్యక్రమాలు
- ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఐడిసి చైర్మన్ మువ్వ
కల్లూరు. నవంబర్ 11. ( విజయ క్రాంతి ): డిసెంబర్ 9న జరిగేటువంటి ఐక్య క్రిస్మస్ వేడుకల పోస్టర్ ను(Unified Christmas Celebration Poster) మండల అధ్యక్షులు డాక్టర్ టి ఎబినేజర్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పి ఏనోష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ మాట్లాడుతూ
క్రైస్తవుల ఆరాధ్య దైవమైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కల్లూరులో 9 డిసెంబర్ 2026 న క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాo అని తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రిస్మస్ సందేశం అందించేందుకు హెల్పింగ్ హాండ్స్ మినిస్ట్రీస్, కాకినాడ బిషప్ పి. నటరాజన్ లాజరస్ హాజరవుతున్నారని తెలిపారు. డిసెంబర్ 9 బుధవారం సాయంత్రం 6 గంటలకు కల్లూరులోని శ్రీకృష్ణ మ్యాంగో యార్డ్‌లో ప్రత్యేక క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా క్రిస్మస్ సంగీత గానాలు, ప్రత్యేక క్రిస్మస్ సందేశం, క్యాండిల్ లైట్ సర్వీస్, కేక్ కటింగ్, కొరియోగ్రఫీ తదితర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఏసుక్రీస్తు జనన సందేశాన్ని ప్రజలకు చాటిచెప్పడంతో పాటు ప్రేమ, శాంతి, సోదరభావం, సేవా గుణాలను పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, టీజీ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు రెవ. పి. ఎనోష్ కుమార్ కార్యక్రమానికి హాజరుకానున్నారు అని నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకలకు క్రైస్తవ సోదరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభువు దీవెనలతో విజయవంతం చేయాలని ఏఐసీసీ కల్లూరు మండల కమిటీ సభ్యులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రేయర్ సెల్ అధ్యక్షులు టి నిర్మల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, జిల్లా ప్రచార కార్యదర్శి దాసరి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు డాక్టర్ టి ఎబినేజర్, గౌరవ సలహాదారులు తేలూరి సంజీవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పి దయాకర్, ఉపాధ్యక్షులు జాన్ పరంజ్యోతి, సుందర్ రాజు, కోశాధికారి గౌడిపేరు జీవన్ కుమార్, మహేష్, రాజశేఖర్ థామస్, శాలెం దాసన్న పలువురు పాల్గొన్నారు.