శరద్ పవార్ ఆరోగ్యంపై మళ్లీ టెన్షన్
డిశ్చార్జ్ తర్వాత మళ్లీ ఆసుపత్రికి.. పవార్ ఆరోగ్యంపై చర్చ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత, NCP (SP) అధినేత శరద్ పవార్ ఆరోగ్యంపై మరోసారి ఆసక్తి నెలకొంది. ఛాతీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకున్న ఆయన గురువారం ముంబైలోని ఆసుపత్రిని సందర్శించారు. గతంలో తీసుకున్న చికిత్సకు సంబంధించి Follow-up Medical Check-up కోసం ఆయన వచ్చినట్లు సమాచారం. 85 ఏళ్ల పవార్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెల 2న దగ్గు, ఛాతీ సంబంధిత ఇబ్బందులతో ఆయన పుణెలోని Ruby Hall Clinicలో చేరారు. నవంబర్ 4న డిశ్చార్జ్ అయిన తర్వాత అదే రోజు ముంబైలోని Breach Candy Hospitalలో తదుపరి చికిత్స కోసం చేరారు. అక్కడ మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన అనంతరం నవంబర్ 7న డిశ్చార్జ్ అయ్యారు. అప్పట్లో ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఇంటి వద్దే చికిత్స కొనసాగించాలని వైద్యులు సూచించారు. ఇప్పుడు మరోసారి Follow-up కోసం ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన ఆరోగ్యంపై తాజా వివరాల కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.