గిరిజన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి
భావితరాలకు అందించండి మాజీ ఎంపీపీ
బోథ్,(విజయక్రాంతి): ఆదివాసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్ప వని వారి ఆచార వ్యవహారాలను భావితరాలకు అందే విధంగా చూడాలని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ కోరారు. ఆదివారం సోనాల మండలంలోని మహదుగూడ నాగు గూడ గ్రామాలను సందర్శించి గుస్సాడీలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయా గుండెల గుసాడి బృందాలకు డీజే బాక్స్ లతోపాటు మైక్ సెట్ అందించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పోట్లతో జోడేఘాట్లో మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివాసి సంప్రదాయాలను కాపాడేందుకు తోడ్పాటు అందించారన్నారు.
ఆదివాసీలు మావ నాటి మావరాజ్ నినాదంతో ఉన్నారని వారి కలలను సహకారం చేసేందుకు ముఖ్యమంత్రి చిన్న చిన్న గ్రామాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి వారి గ్రామాలను వారే పాలించుకునే విధంగా సర్పంచులను చేయడం జరిగింది అన్నారు. ఐకమత్యంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కిషన్ తో పాటు సోనాల గ్రామ నాయకులు సుధీర్ రెడ్డి గ్రామ బి.ఆర్.ఏసు అధ్యక్షులు చిన్నయ్య, యువ నాయకులు రమేష్ హరీష్ అభిలాష్ ,అఖిల్ ,కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.