బెంబేలెత్తిస్తున్నకొండముచ్చు
కోతుల బెడద. జంపుతున్న జనం.
బోథ్, నవంబర్ 9 (విజయక్రాంతి): సోనాల బోత్ మండలాలలోని గ్రామాలలో కోతులు సోనాల మండల కేంద్రంలో కొండముచ్చు(Monkey) గత కొన్ని రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. దీంతో సోనాల మండల కేంద్రంలో చిన్న పిల్లలు పెద్దలు ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటే జంపుతున్నారు. రోజురోజుకు కొండముచ్చు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అంగడి రోజున జనం బెంబేలెత్తిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి సైతం విడిచిపెట్టడం లేదు. ద్విచక్ర వాహనాలను కింద పడగొట్టడంతో పాటు సంతలోకి వచ్చిన వారి మీద దాడులు చేస్తుంది. తాజాగా ఆదివారం రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
అటవీ శాఖ అధికారులకు చెప్పిన లాభం లేకుండా పోయింది.
కొండముచ్చు వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అటవీ శాఖ అధికారులకు(Forest Department officials) చెప్పిన ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులంటున్నారు. దాదాపు ఇప్పటివరకు పదిమందిపై కొండముచ్చు దాడి చేసిందని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయం సైతం వెళ్లి ఇబ్బందులను గురి చేస్తున్నది. దాదాపు రెండు నెలల నుండి మండలంలోని గ్రామాలలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని అయితే ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలిపిన కొండముచ్చును బంధించడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
కొండముచ్చు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండడం జరుగుతుందని జిల్లా అధికారులు ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. మరోవైపు కోతుల దాడి వల్ల గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని బోత్ కేంద్రంలో జూనియర్ కళాశాల పరిసరాలలో పోజులు తిరగడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకు ఆయా మండలాల్లోని గ్రామాల్లో సైతం పోతుల బెడద తీవ్రమైతున్నాయని అంటున్నారు. పంట పొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులంటున్నారు. ఏదేమైనా కొండముచ్చు కోతుల బెడద నివారణ పై జిల్లా అధికారులు దృశ్య సారించాల్సిన అవసరం ఉంది.