నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు

07-10-2026 | 06:05pm

నిర్మల్ అక్టోబర్ 7 ( విజయ క్రాంతి): నిర్మల్ నియోజకవర్గం లో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) అన్నారు. బుధవారం సోను మండల కేంద్రంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

నిర్మల్ నియోజకవర్గం 2000 మంజూరు అయ్యాయని ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున నిధులను వారి ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. ఇంటి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మానస హరీష్ రెడ్డి. తాసిల్దార్ సంతోష్, మండల కన్వీనర్ గంగారెడ్డి, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు