750 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలి

10-11-2026 | 05:57pm

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరీక్షణకు చెక్‌ పెట్టాలి..

తహశీల్దార్‌కు బీఆర్ఎస్‌ వినతి

బూర్గంపాడు,(విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) ఓటర్లు(Voters) గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా ప్రతి 750 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం(Polling station) ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీష్‌(BRS Mandal Working President Jalagam Jagadish) కోరారు. ఈ మేరకు మంగళవారం తహశీల్దార్‌ కేఆర్‌కే ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. 2027లో జరగనున్న ఉమ్మడి వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బూర్గంపాడు మండలంలో ప్రస్తుతం సుమారు 3 వేల మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు.

గత ఎన్నికల్లో 2,079 మంది ఓటర్లకు రెండు పోలింగ్‌ కేంద్రాలే ఉండటంతో మూడు, నాలుగు గంటలపాటు నిరీక్షించాల్సి వచ్చిందన్నారు. ప్రాధాన్యతా ఓటు విధానం, పెద్ద బ్యాలెట్‌ పత్రం కారణంగా ఒక్కో ఓటరుకు ఎక్కువ సమయం పడుతోందని పేర్కొన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా చప్పుడు అదనపు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటు హక్కు వినియోగానికి ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో సారపాక బీఆర్ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు సోము లక్ష్మీ చైతన్యరెడ్డి,చట్టు ఆంజనేయులు,గుల్‌ మహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు