తాడువాయిలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు

10-11-2026 | 05:51pm
  1. ఎక్సైజ్ అధికారులపై సభ్యుల ఆగ్రహం...
  2. నామమాత్రపు తనిఖీలతో పబ్బం గడుపుతున్నారు...
  3. కల్తీ కల్లుతో తీవ్ర ఇబ్బందులు.....

తాడ్వాయి,నవంబర్, 10( విజయక్రాంతి): తాడ్వాయి మండలంలో(Tadvai Mandal) జోరుగా కల్తీకల్లు విక్రయాలు(Sale of adulterated toddy) సాగుతున్నాయని మండల సర్పంచులు(Mandal Sarpanches) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో(Mandal Parishad Office) మంగళవారం మండల ప్రత్యేక అధికారి రఘునందన్ రావు అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కన్కల్ గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి,కాళోజివాడి సర్పంచ్ ఏలేటి చంద్రారెడ్డిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్లులో ఎక్కువ మోతాదులో కల్తీ మందులు కలుపుతున్నారని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మీరు ఎప్పుడైనా కల్లు దుకాణాలలో కల్లు శాంపిల్స్ సేకరించారా అంటూ ఎక్సైజ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ను నిలదీశారు.మీరు కల్లు శాంపిల్స్ సేకరించిన కల్లు దుకాణాల యజమానులు ఇచ్చిన కల్లు శాంపిల్స్ మాత్రమే తీసుకువెళ్లి ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.మండలంలో ఎక్కడైనా స్వచ్ఛమైన కల్లు ఉందా అంటూ ఎక్సైజ్ అధికారులను నిలదీశారు.

దేమికలాన్,కన్కల్,కరడ్ పల్లి గ్రామాల్లో ఎక్కడైనా ఈత చెట్లు ఉన్నాయా చెట్లు ఉంటే నేను దేనికైనా రెడీ అంటూ సర్పంచ్ రవీందర్ రెడ్డి ఎక్సైజ్ అధికారులతో ఛాలెంజ్ చేశారు.మండల సభ నుంచి ఇప్పుడే కల్లు దుకాణాలకు వెళ్దాం అక్కడ మా ముందే శాంపిల్స్ సేకరించండి అంటూ సర్పంచ్ లు పట్టుబట్టారు.కల్లులో కలిపే డ్రగ్స్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కాళోజి వాడి సర్పంచ్ చంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామాల్లో ఈత చెట్లు ఉంటేనే కల్లు దుకాణాలకు లైసెన్స్ ఇవ్వండి లేదంటే లైసెన్సులు రద్దు చేయండి అంటూ దేమికలాన్ సర్పంచ్ బైరవిరాజిరెడ్డి అధికారులతో మొరపెట్టుకున్నారు.ఎర్ర పహాడ్ లో రోడ్డు పక్కనే కల్లు దుకాణం ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని నందివాడ గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య తెలిపారు. ఈ విషయమై ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ విజయకుమార్ మాట్లాడుతూ..మేము కల్లు శాంపిల్స్ సేకరిస్తున్నామని తెలిపారు.

కల్లు దుకాణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తామన్నారు.కన్కల్ గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది పైప్ లైన్ మంజూరుకు నిధులు మంజూరు చేయండి అంటూ గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి అధికారులను కోరారు. నందివాడ పాఠశాలలో పిఈటి ఉపాధ్యాయుడిని నియమించండి అంటూ గ్రామ సర్పంచ్ పోచయ్య అధికారులను కోరారు. సంగోజివాడిలో తెలుగు ఉపాధ్యాయుడు లేక ఏడాది అవుతుంది,అయినా పట్టించుకోవడం లేదు అంటూ గ్రామ సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో కరెంటు సమస్యలు వచ్చినప్పుడు అధికారులు అందుబాటులో ఉండడం లేదంటూ చిట్యాల గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే అగ్నిప్రమాదం జరిగిన అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఏ అధికారికి ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు అధికారులు వచ్చినప్పుడు సమాచారం ఇవ్వడం లేదంటూ దేవాయపల్లి గ్రామ సర్పంచ్ నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్ రావు, ఎంపీడీవో భరత్ కుమార్, తహాసిల్దార్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు