ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో డిసిసి ఆత్రం సుగుణక్క

10-11-2026 | 05:51pm

జైనూర్, నవంబర్ 10 (విజయక్రాంతి): మండలం మానిగూడలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క(DCC President Athram Sugunakka) పాల్గొని లబ్ధిదారుల కుటుంబానికి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన గుస్సాడి దండారి వేడుకల్లో పాల్గొని ఆదివాసీ సంప్రదాయ పూజలు చేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు