సీతారామ పనులు అడ్డుకున్న ఘటనపై కేసు నమోదు

07-10-2026 | 11:15pm

ములకలపల్లి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ములకలపల్లి మండలం(Mulkalapalle Mandal) కమలాపురం శివారులోని సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టినటువంటి పనులను అడ్డుకుంటున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ములకలపల్లి ఎస్ఐ మధు ప్రసాద్(SI Madhu Prasad) బుధవారం తెలిపారు. అక్కడ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులను ఈర్ల రాంబాబు, వేముల శ్రీను, వల్లపు మహేష్ అనువారు అడ్డుకుంటున్నారని ప్రాజెక్ట్ ఇంచార్జి మేనేజర్ చల్ల  శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.

మరిన్ని వార్తలు