బర్రెను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
07-10-2026 | 10:30pm
కొడిమ్యాల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన జిట్టవేని మధుసూదన్ నాచుపల్లి నుండి దొంగలమర్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బర్రెను ఢీకొని, కిందపడి తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.