కార్యక్రమం ప్రభుత్వానిది.. ఖర్చు అంగన్వాడి టీచర్లదా?
ఏ కార్యక్రమంకు పిలుపునిచ్చిన వారిదే బాధ్యత
పోషణ్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి?
నిర్వహణ.. పర్యవేక్షణ అంతంతే
మహమ్మాదాబాద్: పౌష్టికాహారం లోపానికి గురికాకుండా సమృద్ధి ఎదుగుదలే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ జరగాలనేది ప్రధాన ఉద్దేశం. ఏండ్లు తరబడి ఈ నిర్వహణ కొనసాగుతున్నప్పటికీ పౌష్టికాహారం లోపానికి గురవుతున్న వారి కి ఆదరణ తక్కువగానే ఉందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని అంగన్వాడి కేంద్రాల(Anganwadi Centers) పరిధిలో నిర్వహిస్తున్న ఎక్కడో ఒకచోట నిర్వహించి వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడి కార్యక్రమం బాగా జరిగింది అంటూ ప్రచారం చేసుకుంటున్నా అధికారులు ఆశించిన మేరకు ఈ ఉద్దేశాలు లబ్ధిదారులకు చేరడం లేదని చర్చ జరుగుతుంది. ప్రతి అంగన్వాడి కేంద్రం పరిధిలో ప్రత్యేకంగా పోషణ అభిహన్ కార్యక్రమాలు నిర్వహించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
కాగా ఎక్కడో ఒకచోట నిర్వహించి ఆ కార్యక్రమం ఖర్చులన్నీ అంగన్వాడి టీచర్లపైనే వేసి సంబంధిత అధికార యంత్రంగం కార్యక్రమాన్ని ముగింపు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారని లబ్ధిదారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషన్ అభిహన్ కార్యక్రమమే కాదు ఏ కార్యక్రమం నిర్వహించిన ప్రతి అంగన్వాడి కేంద్రంలో పరిధిలోని లబ్ధిదారులను ఆహ్వానించి నిర్వహించాలని కార్యక్రమ ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయవలసిన ఆవశ్యకత అంగన్వాడీ టీచర్లకు సంబంధిత అధికారులకు ఉందని లబ్ధిదారులు కోరుతుండ్రు.
పర్యవేక్షణ... నిర్వహణ అంతంతే
అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణతో పాటు నిర్వహణ అంతంతే ఉందని లబ్ధిదారులు ప్రశ్నిస్తుండ్రు. సిడిపిఓ తో పాటు సూపర్వైజర్లు పూర్తిస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ నామమాత్రంగా పర్యవేక్షణ చేస్తున్నారని ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదని కేవలం వచ్చిన ఫుడ్ సరఫరా చేసి లెక్కలు రాసుకుని తమ పని అయిపోయిందన్నట్టు అంగన్వాడి కేంద్రాల నిర్వహణ చాలావరకు జరుగుతుందని ప్రజలు ప్రశ్నిస్తుండ్రు.
నంచర్లలో పోషణ్ అభియాన్..
మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో సెక్టార్ లెవెల్ అంగన్వాడీ కేంద్రం-1లో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీడీపీఓ రూప హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల తల్లులకు పోషకాహారం, ఆరోగ్యం, పిల్లల ఎదుగుదలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పద్మ, స్వరూప, మల్లమ్మ, అలవేలు, సునీత, ఏఎన్‌ఎం కొండమ్మ, సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్, డిప్యూటీ సర్పంచ్ సుమిత్రా లక్ష్మణ్, గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, బోయిని బాలయ్య తదితరులు హాజరయ్యారు.