వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ..

07-10-2026 | 11:10pm

సేవా కార్యక్రమాలతో డాక్టర్ టి. రితిక్ రెడ్డి జన్మదిన వేడుకలు

TRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

మహమ్మదాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మండల పరిధిలోని దేశాయిపల్లి (నంచర్లగేట్) చౌరస్తాలో యువ నాయకులు, టీఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ టి. రితిక్ రెడ్డి(TRR Charitable Trust Chairman Rithik Reddy) జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. గండీడ్, మహమ్మాదాబాద్ మండలాలకు చెందిన వికలాంగులకు వీల్‌చైర్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ టి. రితిక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు వీల్‌చైర్లను అందజేశారు. వికలాంగులకు అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అవసరమైన వారికి సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీల్‌చైర్లు అందుకున్న లబ్ధిదారులు టీఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్‌కు, డాక్టర్ టి. రితిక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఘనంగా జన్మదిన వేడుకలు

అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డాక్టర్ టి. రితిక్ రెడ్డితో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రితిక్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు కొనియాడారు.

భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ, జి. అనంత లక్ష్మారెడ్డి, సర్పంచులు రాంలాల్, భగవంత్ రెడ్డి, శాంతిరంగ్యా, పులిందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు