నేరెళ్ల, చిన్నలింగాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

07-10-2026 | 10:51pm

తంగళ్ళపల్లి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల, చిన్నలింగాపూర్ గ్రామాల్లో స్థానిక సర్పంచ్‌లతో కలిసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేల రాజు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డు(Smart Ration Cards)లను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యమని తెలిపారు.

రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మణ్, విజయ, మాజీ ఎంపీటీసీ బైరనేని రాము, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఎడ్ల తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు