వన్ టౌన్ సీఐ కరుణాకర్ సేవలు అమోఘం..
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్..
కొత్తగూడెం అక్టోబర్ 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం వన్ టౌన్ సిఐగా కరుణాకర్(CI Karunakar) విధి నిర్వహణలో అంకిత భావంతో, పని చేస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ, ఈ ప్రాంత వాసులకు అమోఘమైన సేవలు అందించి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారని, జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.
కరుణాకర్ ఇక్కడి నుంచి బదిలీపై వెళుతున్న సందర్భంగా బుధవారం ఆయన్ని స్థానిక పోలీసు స్టేషన్ లో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అద్భుతమైన పని తీరుతో అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకున్న ఏకైక అధికారి కరుణాకర్ అని ప్రశంసించారు.
ముఖ్యంగా ఎన్నికలు,పండుగల ఉత్సవాల సమయంలో సంయమనం పాటిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు కూడా పొందారని గుర్తు చేశారు. ఉద్యోగ రీత్యా కరుణాకర్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,బంటు నరేందర్,వంశీ తదితరులు పాల్గొన్నారు.