కరెంటు కోతతో అల్లాడుతున్న అన్నదాతలు

07-10-2026 | 10:54pm

సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా

ఏడి హామీతో విరమణ

బిచ్కుంద, అక్టోబర్ 07 (విజయక్రాంతి): కరెంటు కోతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో సబ్ స్టేషన్ ఎదుట బుధవారం రైతులు రాస్తారోకో, ధర్నాకు దిగారు. బిచ్కుంద సబ్ స్టేషన్(Bichkunda Substation) దగ్గర రైతన్నలతో కలిసి బీజేపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న కరెంటు కోతను వెంటనే ఆపివేయాలని, రైతులకు పక్కా 12 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు.

రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు, సంబంధిత అధికారులు విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. అనంతరం కరెంట్ శాఖ అధికారి ఏడి కి ఫోన్ కాల్ లో మాట్లాడించారు. రైతులకు పక్కా 12 గంటల కరెంటు ఇస్తానని ఏడి హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో భాజపా బిచ్కుంద మండల అధ్యక్షుడు విష్ణు, బీజేపీ నాయకులు మల్లుదేశాయ్, గణపతి, పీరాజీ, విఠల్, కపిల్, పండరి, యోగేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు